ప్రాంతీయం

రేపు సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన.. వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన…

714 Views

ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 13, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీశాల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పునః నిర్మించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తున్నది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ఆలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

అలాగే ఎల్లారెడ్డిపేట వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణం సైతం సుబ్బారెడ్డి కలిసి కేటీఆర్‌ శంకుస్థాపనలో పాల్గొనున్నారు. అలాగే మున్నూరుకాపు కల్యాణ మండపం ప్రారంభించడంతో పాటు చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనున్నారు. అలాగే జిల్లా కేంద్రంలో ఎస్సీ కార్యాలయంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని ఓల్డేజ్‌ హోమ్‌కి ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే పలు ప్రైవేటు కార్యక్రమాలకు సైతం కేటీఆర్‌ హాజరుకానున్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *