పంట పొలాలను ధ్వంసం చేస్తున్న మట్టి మాఫియా
దుమ్ము లేపుతున్న మట్టి మాఫియా
భారీగా అక్రమ మట్టి తవ్వకాలు పట్టించుకోని రెవెన్యూ అధికారులు
వాల్టా చూట్టానికే తూట్లు
అధికారులకు భారీగా ముడుపులు
జనవరి 16
సంగారెడ్డి జిల్లా
హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి అక్కవంచగూడ షేర్ఖాన్పల్లి గ్రామ శివారులో మట్టి మాఫియా రెచ్చిపోతుంది ఈ గ్రామాలలో గత కొన్ని రోజులుగా మట్టి దంద కొనసాగుతున్న మండల స్థాయి అధికారులు చూసి చూడనట్టుగా నటించడం ఎంత ఘమినార్ధం.
ఈ విషయం పై మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం వలన ప్రభుత్వానికి భారీగా గండి పడుతుందని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు మండల స్థాయి అధికారులు ఎక్కడ ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు.
మట్టి మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది ఇటాచి సహాయంతో వందల ట్రిప్పుల్లో మట్టిని కొడుతున్నారు ఒక్కొక్క టిప్పర్ కి ఐదు నుంచి 15 వేల రూపాయల మధ్య అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న ఈ మట్టి మాఫియా పై ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్య తీసుకోపోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులకు వేల రూపాయలు సొమ్ము ముట్టిందా లేదా అనే అనుమానంతో జీవిస్తున్న ప్రజలు వ్యక్తం చేశారు





