ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజన ఉత్సవాల లో పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు..
ఈ సందర్భంగా *గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ..
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు పాటలు రచనలు చిత్రలేఖనం మొదలగు రంగాలలో వారి అభిరుచి మేరకు ప్రావిణ్యం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ఎంచుకున్నా రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు..
ఈ 27వ జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువజన ఉత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 15 సంవత్సరాల వయస్సు నుండి 29 సంవత్సరాల వయసులో గల యువతీ యువకులను జానపద నృత్యం, జానపద గేయాలు, వ్యాసరచన పోటీ, చిత్రలేఖనం వంటి సామూహిక వ్యక్తిగత ప్రదర్శనలతో ఈ జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ఉత్సవాలలో పాల్గొన్న యువతీ యువకులు ఉత్తమ నైపుణ్య ప్రతిభను ప్రదర్శించి రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడ విజయం సాధించి భవిష్యత్తులో ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నాను అని అన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామదాసు గారు, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ దేవత ప్రభాకర్ యువతీ యువకులు పాల్గొన్నారు.
