(తిమ్మాపూర్ డిసెంబర్ 21)
తమిళనాడు రాష్ట్రం లో భారతీదాసన్ యూనివర్సిటీలో హాకీ పురుషుల క్రీడలో పాల్గొనుటకు జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంత అంతర్ విశ్వవిద్యాలయ హాకీ చాంపియన్ షిప్ కు నిర్వహించబడిన ఆటల పోటీలలో విశేష ప్రతిభ చాటిన శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న బీటెక్ ద్వితీయ సంవత్సరం ఈ.సీ.ఈ విద్యార్థి టి.రాజ్ కుమార్ ఎంపికయ్యారని శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి తెలియజేశారు. విశేష ప్రతిభ చాటిన టి. రాజ్ కుమార్ కు చైర్మన్ ఆర్ధిక సాయం అందిస్తూ పుష్పగుచ్ఛంతో పాటు ట్రాక్ సూట్ బహుకరిస్తూ అభినందించారు.
ఈ సందర్భంగా చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ..
ఇదే విధంగా భారతీదాసన్ యూనివర్సిటీ తమిళనాడులో ఈనెల 24 నుండి 30 వరకు జరగబోయే హాకీ పురుషుల సెలక్షన్ లో కూడా విశేష ప్రతిభ చూపాలని, ఛాంపియన్ షిప్ సాధించాలని విద్యార్థికి సూచించారు.
విద్యార్థి టి.రాజ్ కుమార్ మాట్లాడుతూ..
ఇట్టి ఆటల పోటీలలో పాల్గొనుటకు శ్రీ చైతన్య మేనేజ్మెంట్ వారు కల్పించిన అవకాశాన్ని మరియు ప్రోత్సాహాన్ని వినియోగించుకొని నేను తప్పకుండా ఛాంపియన్ షిప్ సాధించగలనని ఆశిస్తున్నాని చెప్పారు.
ఈ సందర్భంగా ఈ.సీ.ఈ విభాగాధిపతి డాక్టర్ ఎస్. నరేష్ కుమార్ , కళాశాల పాలనాధికారి పారువెల్ల రామారావు, మీడియా అండ్ స్పోర్ట్స్ ఇంచార్జ్ గొంటి రమేష్ లు టి. రాజ్ కుమార్ ను అభినందిచారు..