పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో విద్యార్థిని,విద్యార్థులకు ఓపెన్ హౌస్*
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో భాగంగా జిల్లా రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో ఈ రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో, వివిధ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ విద్యార్థిని విద్యార్థులకి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతు.ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి త్యాగాలను స్మరిస్తూ ఉండాలని అన్నారు.ఫ్లాగ్ డే లో భాగంగా నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు ఆయుధాల గురించి,పోలీసు చట్టాల గురించి, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాల గురించి, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్,ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి డయల్ 100,షీ టీమ్ గురించి,పోలీస్ విధులు మరియు పోలీసులు ఉపయోగిస్తున టెక్నాలజీ,పోలీస్ స్టేషన్ ఆవరణ, ఎస్హెచ్ఓ రూమ్, స్టేషన్ రైటర్, లాక్ అప్స్, రిసెప్షన్, ఇన్చార్జి రూమ్, టెక్ టీం రూమ్, తదితర పరిసరాలను మరియు విహెచ్ఎఫ్ వైర్లెస్ సెట్ చూపించి పోలీస్ అధికారులు నిర్వహిస్తున్న విధుల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది అన్నారు. పోలీస్ స్టేషన్లో దరఖాస్తు రాగానే విచారణ చేసి ఏ విధంగా కేసు నమోదు చేయడం జరుగుతుంది, మరియు నిందితులను అరెస్టు చేయడం, కేసు పరిశోధన చేయడం తదితర అంశాల గురించి వివరించడం జరిగింది.ఆర్ఎస్ఐ శ్రవణ్ పోలీస్ శాఖలో వినియోగించే ప్రతి ఆయుధం పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించడం జరిగింది..పలు రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగం,గురించి వివరనిచ్చారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ విశ్వప్రసాద్, సి.ఐ అనిల్ కుమార్,ఎస్.ఐ లు దామోదర్, శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ రాజు,శ్రవణ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
