ప్రాంతీయం

మంచిర్యాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన – సిపి

75 Views

*మంచిర్యాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సిపి *

మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులను తోపాటు పెండింగ్ ఫైల్స్, పలు దర్యాప్తులో ఉన్న కేసు వివరాలను పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రిసెప్షన్ సెంటర్ రికార్డ్ లు చెక్ చేశారు. సిబ్బంది పని తీరు అడిగి తెలుసుకొన్నారు. ట్రైనీ ఎస్ఐ తో మాట్లాడి పోలీస్ స్టేషన్ రికార్డ్స్, చేయవలసిన విధులు గురించి అధికారులను, సిబ్బంది నీ అడిగి తెలుకోవాలని సూచించారు. అనంతరం నేరాల నియంత్రణకై తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులకు సూచనలు చేశారు.

No Slide Found In Slider.

Poll not found