Breaking News

వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి.

137 Views

వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బుధవారం దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వడ్ల కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పటంతో రైతులలో ఆందోళన చెందుతున్నారు అటు ఐకెపి ఇటు సహకార సంఘాలు వెంటనే అప్రమత్తమై కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు గతంలో మాదిరిగా కాకుండా రైతుల వడ్ల లో అధిక తూకం వేయడం వడ్లలో పొల్లు ఉందంటూ రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు రైస్ మిల్లర్లు ప్రభుత్వంతో కుమ్మక్కై రైతులను నష్టపరచ వద్దన్నారు  తూకం వేసిన వెంటనే రైతుల ఖాతాలలో ఆలస్యం కాకుండా డబ్బులను వెంట వెంట జమ చేయాలన్నారు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం వడ్ల కొనుగోలు సమయంలో రైతులను పట్టించుకోవడం లేదన్నారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి నాయకులు కొత్తపల్లి దేవయ్య గంట బుచ్చగౌడ్ గుండాటి రామ్ రెడ్డి ఎండి హిమాం కోనేటి పోచయ్య మానుక నాగరాజు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రాజు నాయక్ పట్టణ అధ్యక్షుడు చిన్ని బాబు  తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7