సిరిసిల్ల భాజపా శాసనసభ అభ్యర్థి రాణి రుద్రమదేవి
ఎల్లారెడ్డిపేట మండలం 02 నవంబర్ 23
సిరిసిల్లలో జరిగే దోపిడిని అరికట్టి కాషాయ జెండా ఎగరవేయాలని భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల శాసనసభ అభ్యర్థి రాణి రుద్రమ దేవి పేర్కొన్నారు.
గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భాజపా నాయకులతో కలిసి నూతన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాజపా తోనే సిరిసిల్లలో జరిగే దోపిడీని అరికట్టాగలమని వారు సూచించారు. బి ఆర్ఎస్ అవినీతిని ఎండగట్టాలని ఆమే పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి తెలంగాణ లో జరగాలంటే సిరిసిల్ల ప్రజలు భాజపా ను ఆశీర్వదించాలని ఆమే పిలుపునిచ్చారు. గతంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గం ఓటర్లు మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ను ఆశీర్వదించి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించడం వల్ల కేంద్ర మంత్రి గా పనిచేశారని వారు పేర్కొన్నారు. అదే విధంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా బండి సంజయ్ ను ఆశీర్వదించారని దీంతో భాజపా రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారని ప్రస్తుతం భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారని వారు పేర్కొన్నారు. సిరిసిల్ల ఓటర్లు ఆశీర్వదిస్తే ఎంతో ఎత్తుకు ఎదగగలమని అంత శక్తి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఉన్నదని వారు స్పష్టం చేశారు . రాబోయే శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్లలో భాజపా ను ఆశీర్వదించి కాషాయ జెండా ఎగురవేయాలని రాణి రుద్రమదేవి తెలియజేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డ బోయిన గోపి, రాజన్నపేట ఎంపీటీసీ దరావత్ రజిత రవీందర్, మండల భాజాపా అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకటరెడ్డి , అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ రెడ్డి, నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డి , నేవూరి శ్రీనివాస్ రెడ్డి , మిర్యాల్ కార్ రవి, ఓబిసి మండల అధ్యక్షుడు బొమ్మిడి స్వామి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
