తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలోని ముస్లింలకు దశాబ్దాల నుండి ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం సీనియర్ రాష్ట్ర నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ముస్లింల అభివృధి కర పత్రాలను బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తొట ఆగయ్య, రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, టెక్స్టైల్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ఉపా అధ్యక్షులు సత్తార్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా, మహమూద్, అంజద్ మైనారిటీ జనరల్ సెక్రట్రీ రఫీద్దీన్ లు పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
