రెవెన్యూ డివిజన్ సాధించుకునేంతవరకు ఉద్యమం ఆగదు..
జేఏసీ అధ్యక్షులు డాక్టర్ రామగుల్ల పరమేశ్వర్….
చే ర్యాల అక్టోబర్ 12
సిద్దిపేట జిల్లా :చేర్యాల ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా సాధించుకునేంతవరకు ఉద్యమాన్ని ఆపబోమని అంచలంచలుగా ఉద్యమాన్ని ఉధృతం చేసి రెవెన్యూ డివిజన్ సాధించుకొని తీరుతామని చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన జేఏసీ అధ్యక్షులు డాక్టర్ రామగుల్ల పరమేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం రోజు 32వ రోజుకు చేరుకున్న ఈ రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐ ఎం జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగుల్ల పరమేశ్వర్ దీక్షలో కూర్చున్న సిపిఎం నాయకులకు ఆకుపచ్చ కండువాలు కప్పి దీక్షలను ప్రారంభింపజేశరు
