ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కలిసిన మర్కుక్ బీజేపీ శ్రేణులు
అక్టోబర్ 24
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బిజెపి అధ్యక్షులు రమేష్,బి జె పి పార్టీ వివిధ మోర్చాల అధ్యక్షులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఈటెల రాజేందర్ ను మంగళవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ గురువారం ఉదయం 10 గంటలకు గజ్వేల్ లోని ఎస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే బి జె పీ ఆత్మీయ సభ వివిధ పార్టీల నుండి బి జె పీ లో చేరే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బి జే పీ పార్టీ మర్కుక్ మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి తిరుపతి రెడ్డి తెలిపారు మర్కుక్ మండలం లోని వివిధ గ్రామాల నుండి బిజెపి పార్టీలోకి భారీ వరసలు ఉంటాయని, రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలవడం ఖాయమని, తెలంగాణలో బిజెపి పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాల మర్కుక్ మండల బి జె పి పార్టీ అధ్యక్షుడు తొడుపునూరి రమేష్, కానుగంటి బాలకృష్ణ రెడ్డి, రాజేందర్ సింఘ్, పత్తి మహేష్,గోపాల్,శ్రీకాంత్ రెడ్డి, ముక్కిడి శామిల్,ప్రవీణ్,కరుణాకర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
