ముదిరాజుల ఆత్మగౌరవ సభ
అక్టోబర్ 8
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ముదిరాజుల ఐక్యత వేదికకు అడవిదేవులపల్లి మరియు ముది మాణిక్యం గ్రామాల నుండి ముదిరాజులు భారీగా తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా ముదిరాజులు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న ముదిరాజులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
ముదిరాజులను అన్ని రకాలుగా గుర్తించి ప్రతి పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించాలని కోరారు.ముదిరాజుల సమస్యలు పరిష్కారం కోసం,హక్కుల కోసం సికింద్రాబాద్ లో ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ముదిరాజులు ఇలాగే ఐక్యంగా ఉండాలని హక్కులు సాధించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తుమ్మల కొండలు, బొమ్మ కంటి కొండలు,పిల్లి శ్రీను, పూజల బాబా,తుమ్మల సైదయ్య, గువ్వల వెంకటేశ్వర్లు,పిల్లి సైదయ్య, పిల్లి చిరంజీవి,పూజల నరసింహారావు,పిల్లి పుల్లారావు మరియు అధిక సంఖ్యలో ముదిరాజులు బయలుదేరి వెళ్లారు
