సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 5
24/7 తెలుగు న్యూస్
సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నర్సాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ములుగు ఎస్ఐ విజయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ తన స్నేహితుడు నవీన్ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై వంటి మామిడి వైపు వెళుతుండగా తునికి బొల్లారం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
