ఆధ్యాత్మికం

చాంద్ ఖాన్ మక్త గ్రామస్తులకు ముత్యాల తలంబ్రాల పంపిణి

68 Views

– రామకోటి రామరాజు కృషి అమోఘమని గ్రామస్తుల సన్మానం
గజ్వేల్ , ఆగస్టు 29
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం లోని శ్రీరామకోటి భక్త సమాజం చేస్తున్న సేవకు గాను 100కిలోల ముత్యాల తలంబ్రాలను భద్రాచల దేవస్థానం అందించింది. వీటిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది భక్తులే లక్ష్యంగా పంపిణి చేస్తున్నారు. గురువారం నాడు వర్గల్ మండలం చాంద్ ఖాన్ మక్త గ్రామస్తులకు హనుమాన్ మందిరం వద్ద ముత్యల తలంబ్రాల యొక్క విశిష్టతను తెలియజేసి భక్తులకు అందజేసిన రామకోటి సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు .

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి గ్రామస్తులందరు కూడ పెద్ద ఎత్తున రామనామాన్ని స్మరిస్తూ గోటితో ఒడ్లను ఓలిచి భద్రాచల కల్యాణనికి అందించారు. వారి రామ భక్తి అమోఘం అన్నారు. అందుకే తిరిగి వారికీ కల్యాణ ముత్యాల తలంబ్రాలు అందిస్తునన్నారు. ఈ సందర్బంగా తలంబ్రాలు అందుకున్న భక్తులు మాట్లాడుతూ రామకోటి రామరాజు కృషి, పట్టుదల వల్ల మా గ్రామానికి మొదటి సారిగా ముత్యాల తలంబ్రాలు రావడం మా అదృష్టం అని రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్