మంచిర్యాల గోదావరి తీరంలో ఈనెలలో జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతర సౌకర్యాల ఏర్పాట్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పర్యవేక్షించారు.
శనివారం అధికారులతో కలిసి జాతర పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగ వద్దని సూచించారు. జాతర నిర్వాహనకు కోరిన వెంటనే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఆ నిధులతో మంచిర్యాల, నస్పూర్ లో జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. స్నానాల గదులు, తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జాతరతో పాటు శివరాత్రికి పుణ్య స్థానాలకు వచ్చే భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
