మర్కూక్ మండల అన్ని గ్రామాల ప్రజలందరికీ విజ్ఞప్తి సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ , మర్కూక్ మండల అన్ని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి గత రెండు రోజులుగా వర్షాల కారణంగా జాగ్రత రానున్న 48 గంటలలోపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించగలరు
వర్షానికి తడిసిన విద్యుత్ స్థంభాలను, గోడలను తాకూడదు
చెట్ల క్రింద ఉండరాదు, ఫోన్లు ఉపయోగించరాదు
రైతులు బావులు, బోర్ల వద్ద కరెంట్ పెట్టె ముందు తడిసిన స్టార్టర్ లను, ఫ్యుజ్ బాక్స్ లను చేతులతో ముట్టుకోరాదు
వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి, గుంతలు ఏర్పడి, అందులో నీరు నిల్వ ఉండి, ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
ఇట్టి పై విషయాలు ప్రజలందరూ ఈ వర్షా కాలం లో పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్…
