రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్ చరవాణిలోవర్షాలవల్ల నష్టపోయిన ప్రజలకు సాయం అందించాలని కోరారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి కు ఫోన్ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల జిల్లాలో జరిగిన ప్రాణ, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలవల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు తీసుకుంటున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.
