మెడికల్ కాలేజీల ఏర్పాటు అద్భుతం
– మర్కుక్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా మర్కుక్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం మహాద్భుతం సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుల ప్రత్యేక చొరవతో కళాశాలల ఏర్పాటు జరగడం సంతోషకరమని మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఒకేరోజు రాష్ట్రంలోని ఆయా జిల్లా కేంద్రాల్లో 9 వైద్య కళాశాలను ప్రారంభించుకోవడం చరిత్రలో నిలిచిపోయి రోజన్నారు తొమ్మిదిన్నరెండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా గ్రామీణ ప్రాంత ఆసుపత్రులను బలోపేతం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో నిరుపేదలకు వైద్యం చేరువవుతుందని గ్రామీణ ప్రాంత విద్యార్థులు మెడికల్ కళాశాలలో చేరేందుకు అణువుగా ఉంటుందన్నారు. తొమ్మిదిన్నరెండ్ల కాలంలో మర్కుక్ మండలం అభివృద్ధిలో దూసుకుపోయిందని ఆయా గ్రామాల్లో శరవేగంగా అభివృద్ధి పనులు జరిగాయంటే సీఎం కేసీఆర్ కృషి రాష్ట్ర మంత్రి హరీష్ రావు సహకారంతో జరిగిందన్నారు. మండల అభివృద్ధి కోసం అసంపూర్తిగా మిగిలిన పనులకు రూ.4. 58 కోట్లు అదేవిధంగా కొత్తగా కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం రూ.3.70కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. చిన్న గ్రామపంచాయతీలకు 30 లక్షలు పెద్ద గ్రామ పంచాయతీలకు 50 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యారు. త్వరలోనే అభివృద్ధి పనులు ముమ్మరంగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
