ఉప్పల్ గణేష్ నగర్ కాలనీ లో కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం.
అక్టోబర్ 20, ఉప్పల్
ఉప్పల్ డివిజన్ లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం జోరుగా సాగుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిక్లరేషన్ల గురించి వివరిస్తున్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఆదేశాల అనుసారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం ఉప్పల్ లోని *గణేష్ నగర్ కాలనీ లో* చేపట్టడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారంటీలు ప్రజలకు తెల్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ రజిత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొరంపేట కృష్ణ, ఈగ అంజయ్య, ఏ బ్లాక్ ఎస్ సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ, డివిజన్ జనరల్ సెక్రటరీ తుమ్మల దేవి రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
