సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం 24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్14:మండల కేంద్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు. సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం గత 14 రోజుల నుండి సమ్మెకు పోవడంతో మండల వనరుల కేంద్రము మూతపడింది. ఎం ఆర్ సి మూతపడడముతో విద్యాశాఖకు సంబంధించిన అన్ని రకాల పనులు ఎక్కడికక్కడ ఆగి పోయాయి.ఎం ఆర్ సి కార్యాలయంలో పనిచేసే ఎంఐఎస్, సిసిఒ,సిఆర్ పి, ఐఇఆర్ పి, పిటిఐ,మెసెంజర్ లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మెకు వెళ్ళడం వలన విద్యార్థులకు వచ్చే రాగిజావ, మధ్యాహ్న భోజన బిల్లులు, ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని రకాల పనులు ఎక్కడికక్కడ ఆగి పోయాయి.సిబ్బంది అందరూ సమ్మెకు వెళ్ళడం వలన ట్రాన్స్ పర్స్ కు సంభందించిన సమాచారం ఆగిపోయింది.సిద్దిపేట జిల్లాలో సుమారు 919 మంది సిబ్బంది సమగ్ర శిక్ష లో పని చేస్తున్నారు.వీరంతా సమ్మెకు పోవడము వలన విద్యాశాఖకు సంబంధించిన అన్ని పనులు ఆగిపోయాయి.రాష్ట్ర వ్యాప్తంగా 22000 మంది సమ్మెకు వెళ్లి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులర్ చేయాలని, భీమా సౌకర్యం కల్పించాలని,ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.