ఉచిత వైద్య శిబిరం.. మందుల పంపిణీ
సెప్టెంబర్ 14
సిద్దిపేట జిల్లా : మర్కుక్ మండల కేంద్రంలోని మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, 120 మంది పేషంట్లకు షుగర్ బీపీ ఇతర పరీక్షలు నిర్వహించి, మర్కుక్ గ్రామం లో గురువారం సర్పంచ్ భాస్కర్ చేతులమీదుగా ప్రారంభించి మెడికల్, ఉచిత మందులు పంపిణీ చేసినట్లు వైద్యులు మాస్, గగన,శృతి,తేజ తెలిపారు. వైద్య శిబిరంలో ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం అభినందనీయమని సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామాలలో చేయడం వల్ల దూరప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునే రోగులకు ఇది ఒక సదవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజల కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వైద్యులు.. ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలోమార్కెటింగ్ ఇంచార్జి కుమార స్వామి , బాలకృష్ణ పాల్గొన్నారు.
