Breaking News

లెనిన్ నగర్ లో కమ్యూనిటీ అవగాహనా కార్యక్రమం

21 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

లెనిన్ నగర్ లో కమ్యూనిటీ అవగాహనా కార్యక్రమం

చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు: సీఐ గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి.

ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్ లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ అవగాహనా కార్యక్రమం ఏర్పాటుచేసి గంజాయి మత్తు పదార్థాల అలవాట్లపై అవగాహన, దొంగతనాలు, చైన్స్ స్నాచింగ్ ల అప్రమత్తతపై, , వాహనాల ధ్రువీకరణ పత్రాలు, త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్, సైబర్ నేరాలపై అవగాహనా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ….
రాత్రి పూట ఇతర రాష్ట్రాల నుండి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చివరగా ఉన్న ఇండ్లలలోని మహిళా పై ఉన్న ఆభరణాల దొంగతనాలకు పాల్పడుతున్నారు కావున జాగ్రత్తగా ఉండాలి.ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పగటి సమయంలో స్టూల్స్, చైర్స్, చాపలు, ఇతర వస్తువులు అమ్ముకుంటూ తాళం వేసిన ఇండ్లను గుర్తించి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది కనుక అనుమానాస్పదంగా కనిపించిన ఆడవాళ్ల, వ్యక్తుల వివరాలు అడగాలి.బయటకు వెళ్లే సమయంలో మహిళలు తమ నగలు కనిపించకుండా మెడలపై నుంచి చున్ని గాని, చీర కొంగు గాని కప్పుకోవాలి.కొంతమంది యువత గంజాయికి బానిసలుగా మారి నేరాలకు పాల్పడుతూ భవిష్యత్తును నాశనం చేసుకోవడం జరుగుతుంది.గంజాయి మత్తులో కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడడం, జల్సా లకు డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడడం, గొడవలకు, దాడులకు పాల్పడడం జరుగుతుంది.

మీ ప్రాంతంలో ఎవరైనా గంజాయి అమ్మిన, సేవించిన, సరఫరా చేసిన, నిల్వ చేసిన, ఎలాంటి చట్ట వ్యతిరేక  పాల్పడిన ఏదైనా సమాచారం ఉన్నట్లకార్యకలాపాలకుయితే డయాల్ 100, లేదా స్థానిక పోలీసుల గాని సమాచారం అందించగలరు. అందించిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతుంది.

మీ మీ వాహనాలకు ధ్రువీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ ట్రాన్స్ డ్రైవింగ్ చేసి ప్రమాదాల గురై యువత కుటుంబాలకు తీరని నష్టం కలిగిస్తున్నారన్నారు. ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని లేని వాహనాలు సీడ్ చేయడం జరుగుతుందన్నారు. మైనర్ డ్రైవింగ్ చట్ట రీత్యా నేరం. మైనర్ కు వాహనాలు చేదైన ప్రమాదానికి గురైతే వాహన యజమానులపై కూడా చట్టపరమైన నేరాలు నమోదు చేయడం జరుగుతుందన్నారు.  మహిళలు ఇంట్లో ఉన్న (ఆడ, మగ) పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలి. పిల్లలు ఫోన్ లను విపరీతంగా ఉపయోగిస్తూ సోషల్ మీడియా పరిచయాలతో ప్రేమ పేరుతో జీవితం నాశనం చేసుకోవడం జరుగుతుంది. కావున తల్లితండ్రులు పిల్లల ప్రవర్తన, కదలికలు, స్నేహితుల పై దృష్టి సారించి గమనిస్తూ ఉండాలి. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకుండా, ఏదైనా నేరం జరగకుండా ముందస్తుగా సమాచారం అందించిన, ప్రజల రక్షణకు తమ వంతు సహకారం అందించిన వారికి పోలీసులు ఎల్లప్పుడూ సహాయంగా అందుబాటులో ఉంటుంది అని సీఐ హామీ ఇచ్చారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్