కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం వ్యాప్తంగా తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 100 మంది మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ముస్లింలకు పెద్దపీట
వేస్తున్నాడన్నాడు. ముస్లింలకు షాదీ ముబారక్, మైనార్టీ బంద్, గృహలక్ష్మి పథకం, కుట్టుమిషన్లు,ఇలా అనేక పథకాలను అమలు చేస్తూ ముస్లింల పాలిట దేవుడయ్యారని కొనియాడారు…
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మానకొండూర్ జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మానకొండూరు ఎంపీపీ సులోచన- శ్రీనివాస్ రెడ్డి, కేశపట్నం మండల అధ్యక్షుడు గంట మైపాల్ రెడ్డి, కేశపట్నం జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…





