24/7 న్యూస్
దుబ్బాక / రాయపోల్
సెప్టెంబర్ 11
శాంతి భద్రతల దృష్ట సోమవారం గజ్వేల్, బేగంపేట్, కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసర ప్రాంతాలను, చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు యొక్క పనితీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న గ్రామాల గురించి సంబంధిత ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరు ఎలా ఉందని ఆరా తీసి, ఏవైనా సీసీ కెమెరాలు పనిచేయకపోతే సంబంధిత ప్రజా ప్రతినిధులతో కలసి వెంటనే రిపేర్ చేయించాలని అధికారులకు సూచించారు. ఏ రకమైన కేసులు నమోదయితున్నాయని అడిగి, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ బ్లూ కోల్డ్స్ విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే రెస్పాండ్ కావాలని, సరైన సమయంలో అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరించాలని తెలిపారు. కేసుల చేదనలో టెక్నాలజీ బాగా ఉపయోగించాలని సూచించారు. పరిశుభ్రత పచ్చదనంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో తెలిపారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు జిడిఆర్ స్కూల్, ఆహ్మదీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నెంటూర్ జిల్లా పరిషత్ హై స్కూల్, కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకునూరు పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ సౌకర్యం, రాంప్స్, చుట్టూ కాంపౌండ్ వాల్, డోర్స్, కిటికీలు, టాయిలెట్ తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పరిధిలోని గ్రామాల ప్రజలకు ఓటు హక్కు గురించి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రాబోవు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ సిఐ జాన్ రెడ్డి, తొగుట సిఐ కమలాకర్, బేగంపేట ఎస్ఐ అరుణ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
