హాలియా లక్ష్మీనరసింహ గార్డెన్ లో నోముల N L ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుపూజ దినోత్సవాన్ని పురస్కరించుకొని సన్మానత్సవ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గస్థాయి లో ఉత్తమ సేవలందించిన 200 మంది ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయులకు శాలువా కప్పి మెమొంటో మరియు ప్రశంస పత్రాన్ని అందించి ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే నోముల భగత్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని విద్యతోపాటు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్న సత్తా ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ ని, తన తండ్రి నోముల నర్సింహయ్య ఆశయ సాధన కోసం పేద విద్యార్థులను తీర్చి దిద్దిన అధ్యాపకులను గౌరవించుకున్నప్పుడే వాళ్లకు గౌరవం ఇచ్చినట్లు అవుతుందనే నమ్మకంతో ఈరోజు ఉపాధ్యాయులను సన్మానించుకోవడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ .
ఈ కార్యక్రమం లో జడ్పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ బొల్లం జయమ్మ,BRS రాష్ట్ర నాయకుడు కర్ణ బ్రహ్మారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, మార్కెట్ డైరెక్టర్ లు సురభి రాంబాబు, కాశీం, PRTU నియోజకవర్గ ప్రతినిధి మంచికంటి మధు,VPRTU కృష్ణారెడ్డి,TPUS గుర్రం ప్రభాకర్,పెదవూర మండల పార్టీ అధ్యక్షుడు రవి నాయక్, హలియా పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు,గుర్రంపోడ్ మండల BC సెల్ నాయకుడు వెలుగు రవి, MEO లు బాలాజీ నాయక్, బాలు నాయక్, తరి రాము,జిల్లా బీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు రాపోల్ పరమేష్,నాగార్జున సాగర్ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మండలి రవి కుమార్,యాదవ ఉద్యోగ సంఘం నాయకులు సింహద్రి యాదవ్,ఉపాధ్యాయ డివిజన్ అధ్యక్షుడు కట్టెబోయిన సైదులు,మహిళా ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.
