లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్త ఆధ్వర్యంలో గజ్వేల్ , ప్రజ్ఞాపూర్ లకు చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావును మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో లయన్స్ క్లబ్ నిర్వాహకులు చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తూ సొంత డబ్బులను వెచ్చిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే లయన్స్ సేవలకు తన వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ భవన నిర్మాణానికి సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేయగా , మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గుప్త , మార్కెట్ కమిటీ డైరెక్టర్ మథిన్ , మదర్సా చైర్మన్ హైదర్ పటేల్ , శ్రీ కొండపోచమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్ గోలి సంతోష్ గుప్త , లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ గుప్త, రీజియన్ చైర్మన్ గుడాల రాధాకృష్ణ, రీజియన్ సెక్రటరీ సంజయ్ గుప్త, లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షులు పరమేశ్వర్,దొంతుల సత్యనారాయణ , అమర నాగేoదర్, తదితరులు పాల్గొన్నారు .
