హైదరబాద్ తొలి మేయర్ కొరవి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి సంధర్భముగా జగదేవపూర్ మండల కేంద్రంలోని పండుగ సాయన్న విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ఆధ్వర్యములో కొరివి కృష్ణ స్వామి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సంధర్భముగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం ఐకమత్యం అభివృద్ధి కోసం కొరివి కృష్ణ స్వామి ఎంతో కృషి చేశారని తెలిపారు.ఆయన అడుగు జాడల్లో నడుస్తూ సంఘం అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందెందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా మండల అధ్యక్షురాలు జయమ్మ ,మండల ముఖ్య సలహాదారుడు రిపోర్టర్ బలరాం ముదిరాజ్, యూత్ విభాగం మండల ప్రధాన కార్యదర్శి బాలకిషన్ ముదిరాజ్ ,సంఘం గ్రామ అధ్యక్షులు బాలయ్య ముదిరాజ్ ,నరేశ్ ముదిరాజ్ ,సుధాకర్ ముదిరాజ్, సంఘం నాయకులు పుల్లయ్య, మంద భూమయ్య , బీమరి కిష్టయ్య, చెక్కల రమేశ్ ,రాగుల బాల్నర్సయ్య, యూత్ గ్రామ అధ్యక్షుడు రాగుల శ్రీకాంత్ ముదిరాజ్ ,నాయకులు ఆయిలయ్య ముదిరాజ్ మరియు సత్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
