*హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం.*
హైదరాబాద్ :జులై 30
ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ పైకి దూసుకెళ్లింది.
కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. కారులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయట పడ్డారు. కారును వదిలి వేసి అక్కడి నుంచి పరారయ్యారు.
గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ మార్గ్ లో హుస్సేన్ సాగర్ కు రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో కారు ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
