Breaking News

_జమిలి ఎలక్షన్లు వస్తేఎలా..?_*

151 Views

*_జమిలి ఎలక్షన్లు వస్తేఎలా..?_*

హైదరాబాద్ :సెప్టెంబర్ 02

జాతీయ రాజకీయాల్లో సంచలనం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలతో ప్రధాని మోదీ ఆపరేషన్ -2024 ప్రారంభించారు. తమకు అనుకూలంగా పరిణామాలను మలచుకొనేందుకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం ఈ ప్రత్యేక సమావేశాల్లో ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ బిల్లు ఆమోదానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది అదే జరిగితే తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరిగే అవకాశం కనిపిస్తోంది

మోదీ కొత్త లెక్కలు

ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం కోసం కొత్త అడుగులు వేస్తున్నారు ఈ నెల 18 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయించారు అధికారికంగా ప్రభుత్వం నుంచి ఈ సమావేశాల అజెండా బయటకు రాకపోయినా మూడు కీలక బిల్లుల ఆమోదం కోసమేనే ప్రచారం సాగుతోంది అందులో యూసీసీ బిల్లు, మహిళా బిల్లుతో పాటుగా జమిలి ఎన్నికల పైనా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

జమిలి ఎన్నికల వెనుక భారీ ప్లాన్ కనిపిస్తోంది ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ లక్ష్యంగా రాజ్యంగ సవరణకు సిద్దం అవుతోంది దీని ద్వారా పార్లమెంట్ తో పాటుగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనేది అసలు లక్ష్యం ఈ ప్రతిపాదన పార్లమెంట్ ముందుకు వస్తే ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్

ఈ డిసెంబర్లో తెలంగాణతో సహా మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్ రాజస్థాన్ మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది ఇప్పుడు కేంద్రం జమిలి ఎన్నికల దిశగా పార్లమెంట్ లో బిల్లు లేదా రాజ్యంగ సవరణలు చేస్తే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ పైన ప్రభావం పడే అవకాశం ఉంది రాష్ట్రాల్లో అసెంబ్లీ గడవు ముగిసే సమయానికి కొత్త సభ్యులతో సభ కొలువు తీరాల్సి ఉంది.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *