*వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ అనిల్ బృందం నేతృత్వంలో చికిత్స లు*
– *ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల చరిత్రలో ఇదే తొలిసారి*. వేములవాడ 01,సెప్టెంబర్ 2023:
ఒకే రోజులో….. 8 మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చరిత్ర సృష్టించింది.
ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మహేష్ పర్యవేక్షణలో డాక్టర్ అనిల్ బృందం మోకాలి మార్పిడి చికిత్స లు ఆగస్ట్ 29 న నిర్వహించింది. రోగులు వేగంగా కోలుకుంటున్నారు.
ఒక్కో మోకాలి మార్పిడి చికిత్స కు ప్రైవేట్ ఆసుపత్రిలో చేసుకుంటే రూ.లక్ష 50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ మొత్తాన్ని భరించలేక బాధను దిగిమింగుతూ పేద ప్రజలు ఇంతకాలం జీవనం సాగించారు.
వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తున్న సమాచారం వారికి చేరడంతో ఆసుపత్రికి వైద్యులను
సంప్రదించారు.ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఒకే రోజులో….. 8 మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి చరిత్ర సృష్టించాం. మేము కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా శస్త్ర చికిత్సలు నిర్వహించడం ఆనందంగా ఉంది.
