-రక్త దానం చేయండి – ప్రాణ దాతలు కండి..
ఎంత దానం చేసిన తరగనిది ఆస్తి రక్తం..
-ఆపదలో ఉన్న వారికి అదే అమృతం..
-మీరు దానం చేసే రక్తం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు..
-ఆపదలు ఎప్పుడు చెప్పి రావు..
-యువత రక్త దానం చేయడానికి ముందుకు రావాలి..
-ప్రాణాలు నిలపడం లో బ్లడ్ బ్యాంక్ లది కీలకపాత్ర పాత్ర..
*జీవన్ ధార వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం లో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు..*
*03-సెప్టెంబర్-2023,*
*నిజామాబాద్ అర్బన్*
గౌ.నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నిజామాబాద్ నగరం లో ముదిరాజ్ గల్లీ లో జీవన్ ధార వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ని ప్రారంభించారు.
*ఈ సందర్భంగా గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ..*
????ఎంత దానం చేసిన తరగని ఆస్తి రక్తం. కులా మతాలు వేరైనా మనుషుల్లో ప్రవహించేది ఒకే రక్తం.
????ఆపదలు, ప్రమాదాలు చెప్పి రావు.ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలు నిలబెడుతున్న రక్త నిధి కేంద్రాలకు సహకారం అందించాలి.
????యువత రక్త దానం చేయడానికి ముందుకు రావాలి.
????మీరు చేసే రక్త దానం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
????వాలంటీరిగా సమాజ హితం కోసం పనిచేస్తున్న రక్త నిధి కేంద్రాల నిర్వహులకు అభినందనలు.
ఈ కార్యక్రమంలో సిర్ప రాజు, కొండపాక రాజేష్,ఎర్రం గంగాధర్,బొబ్బిలి మురళి,తడ్కల్ శ్రీను మరియు నిర్వాహకులు పాల్గొన్నారు.
