– ప్రజలకు సేవలు చేయడం మా నాయకుడి లక్ష్యం
– ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్
– బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి: మన్ననూర్ గ్రామం:
దాచుకోవడం ప్రజలను విలువ దోచుకోవడం కాంగ్రెస్ పార్టీలో ఉన్న డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నైజం అని అమ్రాబాద్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు గ్రామంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ…… అభివృద్ధి అంటే మా నాయకుడు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ను చూసి నేర్చుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. ఇక్కడ పుట్టిన అన్నది కాదు, ఎంత అభివృద్ధి చేశామన్నది గుర్తుంచుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు సవాల్ విసిరారు. అభివృద్ధికి మారుపేరు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అని గుర్తు చేశారు. గడిచిన తొమ్మిదేళ్లలో అచ్చంపేట నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అని కొనియాడారు. నాలుగుసార్లు ఓటమిపాలు అయినా నీకు అభివృద్ధి గురించి చెప్తావా అని ఘాటుగా విమర్శించారు. అచ్చంపేట గడ్డపై ముచ్చటగా మూడోసారి విజయ కేతనం ఎగురవేయడం ఖాయమన్నారు. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టుగా ఒక్కసారి గెలిచి అచ్చంపేట నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచావని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మన్ననూరు గ్రామ సర్పంచ్ శ్రీరామ్ నాయక్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పేర్ముల చెన్నకేశవులు, మాజీ సర్పంచ్, మద్దిమడుగు దేవస్థాన కమిటీ డైరెక్టర్ నిమ్మల శ్రీనివాసులు, గ్రామ అధ్యక్షుడు పోలం సతీష్, కప్పేర రవి, సీనియర్ నాయకులు కప్పేర నిరంజన్, సాజన్లతో పాటు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
