ఎల్లారెడ్డి పేట మండలంలోని గ్రామాలలో పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు లైన్ ఇన్స్పెక్టర్ లు,లైన్ మెన్లూ,హెల్పర్లువిద్యుత్ వినియోగ దారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే వారిపై చర్యలు తప్పవని ఎల్లారెడ్డి పేట మండల సెస్ ఏ ఈ ప్రుత్వీదర్ గౌడ్ హెచ్చరించారు.మండలంలోని కొన్ని గ్రామాల విద్యుత్ వినియోగ దారుల మీటర్ల మార్పు పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు,మీటర్ల కు మార్చడం,విద్యుత్ బిల్లులు తామే కట్టి రశీదులు ఇస్తామని చెపుతూ విద్యుత్ వినియో గ దారుల వద్ద డబ్బులు తీసుకొని స్వంతనికి వాడుకున్నారని ఫిర్యాదులు వస్తే .ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా మండలంలోని సెస్ ఉద్యోగులు చూసుకోవాలని ,వినియోగ దారుల నుండి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వారిపై శాఖ పరమయిన చర్యలు తీసుకోవలసి వస్తుందన్నారు.విద్యుత్ వినియోగదారుల ఎలాంటి సమస్యను అయిన తన దృష్టి కి తీసుకు రావాలని వినియోగ దారులు ఏఈ నంబర్ 9440814081 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే సమస్యలను సత్వరం పరిష్కరించ దానికి కృషి చేస్తానని సెస్ ఏ ఈ పృత్వీదర్ గౌడ్ తెలిపారు.
