102వ రోజు ప్రగతి యాత్ర…
ప్రగతిలో భాగంగా 130 యాత్ర డివిజన్ సుభాష్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..*
*హమీద్ బస్తి రాళ్ళకంచె లో రూ. 50లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*హమీద్ బస్తి రాళ్ళకంచె లో నూతనంగా నిర్మించిన మజీద్ – ఏ- మెహ్రాజ్ భవనం నిరూపణ…*
*భగత్ సింగ్ నగర్ పోచమ్మ ఆలయం వద్ద రూ.18 లక్షలతో చేపట్టనున్న నూతన కమ్యునిటీ హాలు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు…*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 102వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని హమీద్ బస్తి రాళ్ళకంచె లో రూ. 50లక్షల వ్యయంతో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు,హమీద్ బస్తీ రాళ్లకంచెలో నూతనంగా నిర్మించిన మజీద్ – ఏ- మెహ్రాజ్ భవనం, భగత్ సింగ్ నగర్ పోచమ్మ ఆలయం వద్ద రూ.18 లక్షలతో నూతన కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు అభివృద్ధి పనుల ప్రారంభం మరియు శంకుస్థాపనలు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి కాలనీ అభివృద్ధే తమ ధ్యేయం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఆపరేటివ్ చైర్మన్ మన్నే రాజు, మాజీ కౌన్సిలర్ బి రంగారావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ హుస్సేన్, యూసఫ్, వెంకట్ స్వామి, ప్రభాకర్, రవి, నవీన్ యాదవ్, శివ, ఖాసీం, జహంగీర్, జావీద్, విష్ణు, మజీద్ – ఏ- మెహ్రాజ్ కమిటీ సభ్యులు, నిర్వహించారు….





