Breaking News

తెలంగాణలో కోకాకోలా పెట్టుబడి 2500 కోట్లు

72 Views

కోకాకోలా పెట్టుబడి 2500 కోట్లు

ప్రపంచ దిగ్గజ శీతల పానియాల తయా రీ సంస్థ కోకాకోలా తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రూ.1,000 కోట్లతో సిద్దిపేటలో నిర్మిస్తున్న బాటిలింగ్‌ యూనిట్‌లో మరో రూ.647 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది.

వరంగల్‌-కరీంనగర్‌ ప్రాంతంలోనూ రెండో యూనిట్‌ను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నది.
సిద్దిపేట తయారీ ప్లాంట్‌కు మరో 647 కోట్లు
ఇప్పటికే వెయ్యి కోట్లతో బాటిలింగ్‌ యూనిట్‌
అదనంగా వరంగల్‌-కరీంనగర్‌ ప్రాంతంలో మరోటి
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో
కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షుడు మెక్‌గ్రీవి భేటీ
విస్తరణ ప్రణాళికలకు సహకరిస్తాం: మంత్రి కేటీఆర్‌
చికాగోలో వివిధ సంస్థలు, ప్రముఖులతో కేటీఆర్‌ వరుస భేటీలు

ప్రపంచ దిగ్గజ శీతల పానియాల తయా రీ సంస్థ కోకాకోలా తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రూ.1,000 కోట్లతో సిద్దిపేటలో నిర్మిస్తున్న బాటిలింగ్‌ యూనిట్‌లో మరో రూ.647 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. వరంగల్‌-కరీంనగర్‌ ప్రాంతంలోనూ రెండో యూనిట్‌ను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నది. శనివారం అమెరికాలోని న్యూయార్‌లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్‌ మెక్‌గ్రీవి పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించారు.

ఈ సందర్భంగా మేక్‌గ్రీవి మాట్లాడుతూ.. కోకోకోలాకు ప్రపంచంలో మూడవ అతిపెద్ద మారెట్‌గా ఉన్న భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామని, అందులో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. అమీన్‌పూర్‌ వద్ద ఉన్న భారీ బాటిలింగ్‌ ప్లాంట్‌ విస్తరణ కోసం గతంలోనే రూ.100 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టామని, సిద్దిపేట జిల్లాలో రూ. 1,000 కోట్లతో నూతన బాటిలింగ్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఏప్రిల్‌ నెల 22న తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తుచేశారు. ఈ మేరకు అకడ సంస్థ నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తున్నదని, మరో రూ.647 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించామని తెలిపారు.

ఈ ప్లాంట్‌ డిసెంబర్‌ 24 నాటి కి పూర్తి అవుతుందని సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు కరీంనగర్‌ లేదా వరంగల్‌ ప్రాం తంలో మరో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదని, దీంతో తెలంగాణలో కోకాకోలా పెడుతున్న పెట్టుబడులు దాదాపు రూ. 2,500 కోట్లకుపైగా ఉంటాయని మంత్రి కేటీఆర్‌కు మెక్‌గ్రీవి వివరించారు. ఇటీవలి కాలంలో తమ సంస్థ అత్యంత తకువ కాలంలో వేగంగా విస్తరించిన ప్రాంతంగా తెలంగాణ నిలుస్తుంద ని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తు న్న సహకారం, వ్యాపార వృద్ధికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు.

అన్ని రంగాల్లో రాష్ర్టానికి పెట్టుబడుల వెల్లువ: కేటీఆర్‌

తెలంగాణకు అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనడానికి తాజాగా కోకాకోలా సంస్థ ప్రకటించిన అదనపు పెట్టుబడి సాక్ష్యంగా నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఐటీ, ఐటీ అనుబంధరంగాల్లోనే కాకుండా ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌, ఫుడ్‌ప్రాసెసింగ్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ వంటి రంగాల్లోనూ భారీగా పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందని చెప్పారు. తాజాగా తెలంగాణలో పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకున్న కోకాకోలా సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న నూతన రెండవ తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షుడు మెక్‌ గ్రీవికి మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *