Breaking News

పొంచి ఉన్న ప్రమాదం

117 Views

పదిర బ్రిడ్జి కు పొంచి ఉన్న ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని సిరిసిల్ల కామారెడ్డి ఆర్ అండ్ బి రోడ్డు దగ్గర మట్టి కోసుకొని పోయి ప్రమాదకరంగా మారిందని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య సోమవారం తెలిపారు ఈ సందర్భంగా పదిర బ్రిడ్జినీ పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ వంతెన నిర్మాణం పూర్తిస్థాయిలో ఆ పక్క ఈ పక్క గోడలను నిర్మించలేదన్నారు గోడలు కట్టి మట్టిని నింపడంలో అప్పటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేయడం మూలంగా బ్రిడ్జ్ తెగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు గత నాలుగు రోజులుగా వంతెనకు ఒకవైపు మట్టి పూర్తిగా కొట్టుకుపోవడంతో బ్రిడ్జ్ ప్రమాదంలో పడింది అన్నారు వాహనాలను సైతం ఒకపక్కనుండే అధికారులు ప్రస్తుతం నడపడం జరుగుతుందన్నారు ఆర్ అండ్ బి అధికారులు తక్షణం స్పందించి రిపేర్ పనులు చేపట్టాలని అన్నారు నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్. ఉప సర్పంచ్ మహేందర్. రాజు నాయక్. ఉన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్