Breaking News

జులై 17 *ఆరోగ్య హుస్నాబాద్ లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మహిళలు బాల బాలికలు యువతి యువకులతో 10కె రన్ నిర్వహించడం జరిగింది*

108 Views

 

 

జులై 17 *ఆరోగ్య హుస్నాబాద్ లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మహిళలు బాల బాలికలు యువతి యువకులతో 10కె రన్ నిర్వహించడం జరిగింది*

 

ఈరోజు ఉదయం 5:30 గంటలకు హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 10కె రన్ హుస్నాబాద్ పట్టణం ఏనే వద్ద పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడమ్

ప్రారంభించి పాల్గొన్నారు అక్కన్నపేట రోడ్డు, జనగామ క్రాస్ రోడ్ నుండి మళ్లీ ఎనె వరకు ప్రమోషనల్ రన్ కొనసాగింది.

 

*ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ* ఆరోగ్య హుస్నాబాద్ లో భాగంగా స్వచ్ఛ హుస్నాబాద్ చైతన్యాన్ని అందరికీ తెలియపరిచే విధంగా రన్ నిర్వహించడం జరిగిందన్నారు. మరియు మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి చొరవతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు పై ఆగస్టు 6న హాఫ్ మారథాన్ రన్ నిర్వహించడం జరుగుతుంది సిద్దిపేట జిల్లా యువతి యువకులు ప్రజలు ప్రజాప్రతినిధులు ఇతర జిల్లా యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈవెంట్ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యద్భుతంగా ఒక పండుగ వాతావరణం లో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని మహిళలకు బాల బాలికలకు యువతి యువకులకు ప్రత్యేకంగా 10కె ప్రమోషనల్ రన్ నిర్వహించడం జరిగింది. ఇందులో మహిళలు బాల బాలికలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలని ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదని ప్రతిరోజు వాకింగ్, రన్నింగ్, యోగా, ధ్యానం, స్విమ్మింగ్, తప్పకుండా చేయాలని సూచించారు. 24 గంటల్లో ఒక గంట మన కుటుంబం మన ఆరోగ్యం గురించి మనము సమయం కేటాయించుకోవాలని సూచించారు. డబ్బులు ఉంటే దాచుకోవాలి, శరీరంలో ఉండే క్యాలరీస్ ఖర్చు చేయాలని సూచించారు.

 

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్

https://shm23.iq301.com ఈ లింక్ ఓపెన్ చేసి వారి యొక్క వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని హాఫ్ మారథాన్ రన్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

 

*బాలికల విభాగంలో బహుమతులు గెలిచిన వారి వివరాలు*

1. గుడిపల్లి ఇందిర

2. బి సంగీత

3. యం. అక్షిత

4. డి. షైనీ

 

*యువకుల విభాగంలో బహుమతి పొందిన వారి వివరాలు*

1. బి. నితిన్

2. సిహెచ్. శ్రీకాంత్

3. ఎన్. సంపత్

4. బి. ఆనంద్,

గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

 

 

ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎడబోయిన రజని అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్, హుస్నాబాద్ ఏసిపి సతీష్, సీఐ కిరణ్, ఎస్ఐ మహేష్, అక్కన్నపేట ఎస్ఐ వివేక్, హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, మరియు కార్యవర్గ సభ్యులు, హుస్నాబాద్ పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు యువతీ, యువకులు, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కత్తుల బాపిరెడ్డి, మరియు కార్యవర్గ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *