ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు24, ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సర్పంచ్ గుర్రం వెంకటేశ్వరి భర్త నారాగౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన ఘటనలో బంధనకల్ గ్రామంలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండగా ప్రజ్ఞాపూర్ అతిధి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతిపట్ల వారి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఈసంఘటన గ్రామంలోని 5.వార్డ్ మెంబర్ మొగిలిపూల సత్యనారాయణ తెలుపగా గ్రామస్తులు పలువురు వారి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుర్రపు నారాగౌడ్ వయసు 65సం. ఆయనకు ముగ్గురు కుమారులు, కాగా ఆంత్యక్రియలు శుక్రవారం రోజున స్వగ్రామంలో జరగనున్నాయిని తెలిపారు.
