హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలు
కామారెడ్డి జిల్లా
డిసెంబర్ 7
బీబీపేట మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో హరి హర పుత్ర అయ్యప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలు శని, ఆది, సోమవారం, రోజులలో జరుపబడును. కావున భక్తులందరూ సకాలంలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి. స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి. మూడు రోజులు అనగా శని, ఆది, సోమ వారాలలో ఉదయం 6 గంటలకు గణపతి హోమం జరుపబడును కావున ఆసక్తి గలవారు ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేయవలసిందిగా మనవి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఊరేగింపు జరుపబడుతుంది.సోమవారం మధ్యాహ్నము ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. అదే రోజు సాయంత్రం 6 గంటలకు హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పడి పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులను కోరుచున్నాము.




