Breaking News

ధరణిలో కొత్తగా ఎనిమిది ఆప్షన్లు

126 Views

ధరణిలో కొత్తగా ఎనిమిది ఎంపికలు

ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో 8 ఆప్షన్లను ప్రభుత్వం కల్పించింది.

భూసమస్యలకు
కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం
క్రయ, విక్రయాల వేళ భూమి మార్కెట్ విలువ తెలుసుకునే వెసులుబాటు

ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో 8 ఆప్షన్లను ప్రభుత్వం కల్పించింది. ఆయా ఆప్షన్లతో జిల్లాలో నెలకొన్న భూసమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు.

ఇవి కొత్త మాడ్యుల్స్

భూమి రిజిస్ట్రేషన్‌ సమయంలో దాని విస్తీర్ణం, మార్కెట్‌ విలువను తెలుసుకొని రిపోర్టును కూడా పొందే అవకాశాన్ని కల్పించారు.
క్రయ, విక్రయాల సమయంలో భూమి మార్కెట్‌ విలువను తెలుసుకోవచ్చు.
గిఫ్ట్‌, సేల్‌ డీడ్స్‌ రిజిస్ట్రేషన్లలో ఒక్కరికే కాకుండా ఎక్కువ మంది కొనుగోలు చేసేలా, విక్రయించేలా అవకాశం కల్పించారు.
ఏజెన్సీ ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల్లోని వారు బ్యాంకుల్లో మార్టిగేజ్‌లకు కుల ధ్రువీకరణ పత్రం జతచేయాలనే నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు.
పేరు, జండర్‌, ఆధార్‌, కులం క్యాటగిరి మార్పు చేర్పులకు టీఎం 33 మాడ్యుల్‌ నుంచి మినహాయింపునిచ్చారు.
పట్టా భూముల పత్రాల్లో అసైన్డ్‌ అని నమోదయితే భూమి రకం, భూమి వర్గీకరణ, భూమి సాగుకు సంబంధించిన టీఎం 33 మాడ్యుల్‌ కింద పరిష్కారం చూపనున్నారు. ఇందులో అసైన్డ్‌ భూములను మినహాయింపునిచ్చారు.
సీసీఎల్‌ఏ, కలెక్టర్‌ లాగిన్‌లలో గ్రామ పహాణి రిపోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
పట్టా పాస్ పుస్తకాల్లో నమోదయిన వివరాలు సరిచేయడానికి వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని తేడాలుంటే వాటిని తిరస్కరించకుండా అవకాశం కల్పించడానికి, ఆయా జాబితాల కలెక్టర్లకు అందుబాటులోకి వస్తాయి.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *