దౌల్తాబాద్: దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి బొప్పాపూర్ లో జరిగిన దుబ్బాక ఆత్మగౌరవ సభలో ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారని, పథకాలు అర్హులందరికీ అందించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారు లాలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, మాజీ ఎంపిటిసి మద్దెల స్వామి, నాయకులు భద్రయ్య, లింగం, రమేష్, నవీన్, శివ, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…
