ధర్మ సమాజ్ పార్టీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహరాజ్ ఆమరణ నిరాహార దీక్ష
సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17
తెలంగాణ రాష్ట్రం లో BC/SC/ST,DFC ,RM(Religion Minorities)ల అభ్యున్నతి కై ధర్మ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వం ముందు 5 డిమాండ్ ఉంచబోతుంది. విద్య,వైద్యం,ఉపాధి,భూమి,ఇల్లు,ప్రజలకు అందించాలని ధర్మ సమాజ్ పార్టీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహరాజ్ ఆమరణ నిరాహార దీక్షను సామాజిక విశ్లేషకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు సత్తయ్య గారు మరియు కెవిపి జిల్లా నాయకులు బిక్షపతి గారు ప్రారంభించడం జరిగింది, పేద ప్రజలైన BC,SC,ST, EBC ల యొక్క శ్రమతో వారు కట్టే పన్నులతో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి ఆ ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య ,ఆత్యాధునికమైన వసతులతో మంచి వైద్యం, పనికి తగ్గిన వేతనంతో ఉపాధి, నివసించడానికి నాలుగు గదుల ఇల్లు, చేసుకోవడానికి అర్హులైన వారికి సాగునీటితో కూడిన ఎకరం భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం .ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు బిట్ల జ్యోతి జిల్లా నాయకులు వేముల వెంకట ప్రసన్న, డిబి రాజు,ర్యాగట్ల చందు,చంచల ఎల్లయ్య,వొద్దిరాల సతీష్,కట్ల అంజి బాబు,మాoకాలి సురేష్,జోగు అనిల్ తదితరులు పాల్గొన్నారు
