Breaking News

హత్య జరిగిన 10 గంటల్లో కేసును చేదించిన గజ్వేల్ రూరల్ పోలీసులు*

124 Views

తేదీ: 24- ఆగస్టు
మృతురాలు వివరాల్లోకెళ్తే
మృతురాలు మిరియాల వెంకటమ్మ భర్త కీర్తిశేషులు కోటయ్య, వయస్సు 45 సంవత్సరాలు, వృత్తి చిల్లర సామాన్ వ్యాపారం కులం బుడగ జంగం, గ్రామం బండ మైలారం
మృతురాలు మరియు తన కొడుకు ఈశ్వర్ ఇద్దరు కలసి బండ మైలారంలో ఉంటున్నారు.

ఫిర్యాది మృతురాలి కూతురు
శైలేజకు తేదీ 24-08-2023 నాడు అర్ధరాత్రి 1:42 గంటలకు ఫిర్యాది చిన్న అమ్మ ఫోన్ చేసి మృతురాలు వెంకటమ్మను బండ మైలారంలోని మృతురాలి ఇంట్లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చంపి వేసినారని తెలుపగా ఫిర్యాది వచ్చి చూడగా మృతురాలు నిజంగానే చనిపోయి ఉన్నది, మృతురాలు మెడ నరికి మృతురాలు రెండు కాళ్లు నరికి మృతురాలి కాళ్లకు ఉన్న వెండి కాళ్ల కడాలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించికొని పోయినారు. మృతురాలికి మరియు మృతురాలికి కొడుకు ఈశ్వర్, వరుసకు కొడుకైన రాము ఇరువురి తరచుగా గొడవలు జరుగుతున్నాయి కావున మృతురాల్ని కొడుకు ఈశ్వర్, మరియు రాము చంపి ఉండవచ్చు అని అనుమానం ఉన్నదని ఫిర్యాదిరాలు ములుగు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఎస్ఐ విజయ్ కుమార్, కేసు నమోదు చేయగా గజ్వేల్ రూరల్ సిఐ జానకిరామ్ రెడ్డి కేసు పరిశోధన ప్రారంభించారు. సీఐ, ఎస్ఐ కేసు పరిశోధనలో భాగంగా మృతురాలి కొడుకు అయిన ఈశ్వర్ పెళ్లి చేయడం లేదని కారణంతో ఈశ్వర్ మరియు మృతురాలికి దూరపు బంధువు అయిన రాము సహాయంతో మృతురాల్ని చంపుదామని ఉదేశ్యంతో మృతురాలిని ఇరువురు కలిసి చంపి అట్టి నేరం వారిపై వస్తుందని భయంతో మృతురాలి యొక్క కాళ్లు నరికి అట్టి కాళ్లకున్న వెండి కాళ్ళ కడియాలు దొంగలించి, వేరే వారు చంపారని అనుమానం రావాలని కాళ్లు నరికి మెడ నరికి చంపి వేసినారు. మృతురాలని ఉద్దేశపూర్వకంగా మృతురాలి కొడుకు ఈశ్వర్, మరియు మృతురాలికి దూరపు బంధువైన పర్వతం రాము, గ్రామం కొత్తూరు, ఇరువురు కలిసి చంపినామని విచారణలో ఒప్పుకున్నారు.

హత్యకు ఉపయోగించిన కత్తి మరియు దొంగలించిన కాళ్ల కడియాలు నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఇరువురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందని గజ్వేల్ రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *