గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలి-బిఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ
తెలంగాణ లో గ్రూప్2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణలోని లక్షలాది నిరుద్యోగుల పక్షాన బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు.RS ప్రవీణ్ కుమార్ సత్య గ్రహ దీక్షను గన్ పార్క్ వద్ద చేయదాలచారు,కానీ సత్యాగ్రహ దీక్షను భంగం కలిగించడానికి తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ఆయన్ని గృహ నిర్బంధం చేయడాన్ని ఖండిస్తూ, వారికి మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ గజ్వేల్ పట్టణ కేంద్రంలో సంఘీభావంగా సత్య గ్రహ దీక్ష చేయడం జరిగింది.వేయిలాది మంది విద్యార్థి అమరుల త్యాగాల మీద సాధించిన తెలంగాణ విద్యా, ఉద్యోగాల కోసం నిత్యం పోరాటం చేయడం అంటే కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిదర్శనం అని నియోజకవర్గ కమిటీ నాయకులు మండి పడ్డారు..గ్రూప్2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ, వాయిదా వేయకపోతే ఎత్తున్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వారికోసం బిఎస్పీ అణునిత్వం పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ నాయకులు దీక్షను సాయంత్రం 5 గంటలకు విరమించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ , నియోజకవర్గ ఇంఛార్జీలు కెతోజి వినోద్ గారు,కొండనోళ్ళ నరేష్ , నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కర్ణాకర్ , ప్రధాన కార్యదర్శి కానుగుల రామణాకర్ ,కోశాధికారి మొండి కర్ణాకర్ ,కార్యదర్శి కోట మహేందర్ , ఈసీ మెంబెర్ కనకప్రసాద్ , వివిధ మండలాల అధ్యక్షులు ,సెక్టార్, బూత్,గ్రామ నాయకులు పాల్గొన్నారు.
