జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మాంటిస్సోరి విద్యార్థి నిమ్మటూరి మిధున
డిసెంబర్ 21
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న నిమ్మటూరి మిధున జాతీయ స్థాయి హౄకీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతాషాజు తెలిపారు. ఈనెల 15 ,16 ,17 తేదీల్లో కామారెడ్డి జిల్లాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ హాకీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కాగా, ఈనెల 25 నుంచి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగే జాతీయస్థాయి హాకీ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు. తెలిపారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినీ మాంటిస్సోరి గ్రూప్ ఆఫ్ స్కూల్ డైరెక్టర్ జీవీకే భరత్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం పట్ల డైరెక్టర్స్, షాజు తామస్, గండ్ర సుధాకర్ రెడ్డి, నూకల శ్రీనివాసరావు, డాక్టర్ సుధాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు





