Breaking News

కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేయడంపై దృష్టి సారించాలి*

222 Views

రాజన్న సిరిసిల: టీ ఎస్ లోకల్ వైఫ్/

జిల్లాలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధులు, ఏఎన్సి చెకప్, ఇమ్యునైజేషన్ లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రెండవ డోస్, బూస్టర్ డోస్ కు అర్హులై కూడా ఇంకా వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. సంబంధిత ఏఎన్ఎం లకు లక్ష్యం ఇచ్చి, నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్ణీత గడువు లోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇమ్యునైజేషన్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఏఎన్సీ పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వంద శాతం జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో వ్యాధుల నియంత్రణ పట్ల అవగాహన కల్పించాలన్నారు.
ఈ సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్లు బి. సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్, ఎన్సీడీ ప్రోగ్రామ్ అధికారి డా. అనిల్, డా. శ్రీరాములు, ఆసుపత్రుల పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, డా. మహేష్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7