– గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేత
దౌల్తాబాద్: మండల పరిధిలోని ఉప్పర్ పల్లి, గువ్వలేగి గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ సురేఖను కలిసి వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, సర్పంచ్ చిత్తారి గౌడ్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పర్ పల్లి, గువ్వలేగి గ్రామాల విద్యార్థులు దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలకు చదువుకోవడానికి వెళ్లే సుమారు 100 మంది ఉంటారని చదువుకోడానికి వెళ్లే విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక ఆటోలో పాఠశాలలకు వెళ్లడానికి ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.20 తీసుకుంటున్నారని అన్నారు. వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని మేనేజర్ ను కోరగా బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగరాజు, నాయకులు మల్లేశం తదితరులు ఉన్నారు.