గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు నమస్కారం!*
*నేను మీ బట్టు అంజిరెడ్డి*
గృహలక్ష్మి పథకం దరఖాస్తు కొరకు ఆందోళన వద్దు
గౌరవ ముఖ్యమంత్రి కె సి ఆర్ ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి రు. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు కావున మంత్రి హరీష్ రావు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు, అలాగే
స్థల ధ్రువీకరణ మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తర్వాత కూడా ఇవ్వవచ్చునని తెలిపారు కావున లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన లేకుండా దరఖాస్తు చేసుకోగలరని మనవి.
*దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు*
1.మహిళా ఆధార్ కార్డు,
2.తెల్ల రేషన్ కార్డు
భర్త పేరుపైన భూమి ఉంటే భార్య పేరుమీద మార్చుకోగలరు
*దరఖాస్తు కార్యాలయాలు :*
ఎంపీడీఓ కార్యాలయం
మున్సిపల్ కార్యాలయం
కలెక్టర్ కార్యాలయం