దౌల్తాబాద్: దౌల్తాబాద్, శేరి పల్లి బందారం గ్రామాల 120 మంది యువకులకు బిజెపి మండలాధ్యక్షుడు పోతరాజు కిషన్, ఉపాధ్యక్షుడు గడ్డమీది స్వామిలు డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు సహకారంతో డ్రైవింగ్ వచ్చినవారు లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తామని, 18 నుంచి 60 సంవత్సరాలు వయసు ఉన్న వారికి ఉచితంగా ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.
