మరో రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో స్కూళ్లకు సెలవుల అంశం తెరపైకి వస్తుంది అయితే సెలవులు ఇచ్చే అంశం ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం స్థానిక పరిస్థితిని బట్టి కలెక్టర్లు తగు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లుగా తెలుస్తుంది ఇటీవల వర్షాలకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులు సెలవులు ఇచ్చింది
